ములకలపల్లి: జనవరి31:
(మన్యం మనుగడ)న్యూస్:
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఐకెఎస్ సిసి) పిలుపు లో బాగంగా,విద్రోహ దినం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని,రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లఖీంపుర్ ఖేరి మారనకాండ కేసులో నిందితులను రక్షించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, లఖీంపుర్ ఖేరి హత్యా కాండ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని, రైతు పోరాటం లో రైతులపై మద్దతు దారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి అదుకోవాలని,మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, అలాగే నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్ధలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రను తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు వూకంటి రవికుమార్, నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు, సున్నం నాగులు, వగ్గేల భద్రయ్య, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: