CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మిర్చి తీవ్రంగా నష్టపోయిందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు శుక్రవారం మంగపేట మండలంలోని అకినేపళ్లి మల్లారం కత్తి గూడెం వాడగూడెం పొదుమూరు గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి వ్యవసాయ క్షేత్రాలను మరియు ఎండు మిర్చి కల్లాలను స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నల్ల తామర పురుగు సమస్యతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన పంట నష్టం అంచనాలను ఉద్యాన శాఖ అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు రాష్ట్రంలో జరిగిన మిర్చి నష్టంపై జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే చైర్మన్ జీవీఎల్ నరసింహారావుకి తాను విషయాన్ని తెలియజేసినట్లు సాంబశివ రెడ్డి తెలిపారు పొదుమూరు వాగులో ఆరబోసిన ఎండుమిర్చి నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని పంటకోత అనంతర యాజమాన్య పద్ధతులలో భాగంగా రైతులు సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే మిర్చిని ఆరబోసుకోవాలని సూచించారు జరిగిన నష్టంపై జాతీయ పంట బీమా పథకం జాతీయ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల ద్వారా భీమా పరిహారాన్ని బ్యాంకు రుణాలు పొందిన రైతులకు రుణాలు పొందకుండా బీమా పథకంలో భాగస్వాములైన రైతులకు సైతం పంట నష్ట పరిహారం వర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖతో సమగ్ర సర్వే నిర్వహించి పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సాంబశివ రెడ్డి వెంట ఆయా గ్రామాలకు చెందిన రైతులు గంధం నరసింహారావు శోభన్ వెంకటరమణ మానవ సేవ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్రీ రామ్మోహన్ బాణాల నరేందర్ దాసరి శ్రీను ఏడుకొండలు దాసరి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: