CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్లాస్టిక్ నిషేధానికి సహకరించండి.. ప్రముఖ దర్శకుడు శ్రీ సుకుమార్ ని కలిసిన జెడి పౌండేషన్.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

 తదుపరి సినిమా లో ప్లాస్టిక్ నిషేధం పై వీడియో ప్రకటన ప్రదర్శిస్తాం అని హామీ ఇచ్చిన శ్రీ సుకుమార్.


ప్రకృతి వినాశనానికి కారణభూతమైన ప్లాస్టిక్ నిషేధించడం లో తమ వంతు సహకారం అందించవలసిందిగా ప్రముఖ దర్శకుడు శ్రీ సుకుమార్ కి విన్నవించిన జేడీ పౌండేషన్ భద్రాచలం వారు, ఈ మేరకు హైదరాబాద్ లో శ్రీ సుకుమార్ నివాసంలో పౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీమోహన్ కుమార్ ఆధ్వర్యంలో కలిసిన సభ్యుల బృందము, భద్రాచలంలో ప్లాస్టిక్ నిషేధం పై జరిగిన ప్రగతిని రిపోర్ట్ రూపంలో వివరించి వారికి అందజేశారు. అలాగే రాబోయే రోజుల్లో సినిమా ప్రదర్శింపబడే ముందు ప్రకటనల లో ప్లాస్టిక్ నిషేధం పై కూడా వీడియో ప్రకటన ప్రదర్శించేలా గా చూడాలని ఆయన దృష్టికి తీసుకెళ్లగా తప్పనిసరిగా తన తదుపరి సినిమాలో ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు, అలాగే ఇదే సమయంలో జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ జెడి లక్ష్మీనారాయణ గారు కూడా వీడియో కాల్ లో మాట్లాడి సహకారం అందించవలసిందిగా కోరారు దానికి తప్పక సహకరిస్తానని హామీ ఇచ్చారు అలాగే పుష్ప సినిమా విజయవంతం అయిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నారాయణ గారు శ్రీ సుకుమార్ కి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు శ్రీ సుకుమార్ ని శ్రీ సీతారామ చంద్ర స్వామి చిత్రపటం తీర్థప్రసాదాలు తో జేడీ ఫౌండేషన్ బృందం సత్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ పుష్ప సినిమా తీసే సందర్భంలో కూడా మారేడుమిల్లి ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ చెత్త ,ప్లాస్టిక్ కవర్లు కనిపించాయని తాము కూడా పర్యావరణానికి హాని కలిగించే కూడా ప్లాస్టిక్ నిషేధం విషయంలో కూడా తమ వంతుసహకారం ఉంటుంది అని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం లో జెడి ఫౌండేషన్ మరియు అన్ని స్వచ్ఛంద సంస్థలు చాంబర్ ఆఫ్ కామర్స్ కలిసి,మీడియా ప్లాస్టిక్ నిషేధం లో కలిసి పని చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడాలి నాగరాజు ఎక్స్ట్రా మై ల్ ప్రతినిధి శ్రీ నాగ మోహన్ , సభ్యుడు శ్రీ జిష్ణు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: