మన్యం టీవీ అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో గత కొన్ని రోజుల నుండి నిర్వహించబడుతున్న ఎం ఆర్ పి ఎస్ యూత్ ఓపెన్ క్రికెట్, టోర్నమెంట్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ లో మణుగూరు లేవన్ మరియు అంబేత్కర్ కాలనీ అశ్వాపురం జట్లు తలపడగా మణుగూరు లేవన్ విజయం సాదించింది. ఈ టోర్నమెంట్ లో విజయం సాధించిన మణుగూరు జట్టు ప్రథమ బహుమతి అంబేద్కర్ లేవన్ అశ్వాపురం జట్టు ద్వితీయ బహుమతి సాధించింది ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులను వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం చేతులమీదుగా క్రీడాకారులకు బహుమతులను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చిలక వెంకటరామయ్య,షేక్ నహీం, టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు గద్దల రామకృష్ణ అశ్వాపురం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: