గుండాల జనవరి 21(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండల కేంద్రంలోని పెట్టి లైజర్ యజమాని మానాల వెంకటేశ్వర్ల ఇంటికి చేరుకొని వారి తల్లిదండ్రుల చిత్రపటానికి నివాళులర్పించారు. ఆంధ్రజ్యోతి విలేకరి కుటుంబాన్ని పరామర్శించారు. నర్సాపురం ఈసం బుచ్చి రాములు, అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మీపురం గ్రామంలో కల్తీ ఎల్లమ్మ మృతిచెందగా వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు భవాని శంకర్ మండల అధ్యక్షులు భాస్కర్, వీరస్వామి, కల్తీ లింగయ్య , అజ్జు , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: