మన్యం టీవి న్యూస్,మణుగూరు:
ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి 3వ సంవత్సర ఆవిర్భావ వేడుకలను సోమవారం బూర్గంపాడు మండల పరిధిలోని యాసిస్ మజీద్ కమిటీ హాల్ నందు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముస్లిం మైనారిటీల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, గారు సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు యాకూబ్ పాషా గారు హాజర య్యారు. అనంరతం అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ గారు మాట్లాడుతూ ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు మైనారిటీ సంక్షేమ సమితి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి ముస్లింలకు అందాల్సిన పథకాలను సక్రమంగా అందేలా సమితి కృషి చేస్తుందన్నారు. అర్హులైన ముస్లింలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరుచేయాలని, మౌజన్, ఇమామ్లకు వేతనాలు అందరికీ అందించాలని షాదీ ముబారకు పథకాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలు అందర్నీ " సమైక్య పరచి వారికి విద్య, వైద్య రాజకీయ పరంగా ముందు కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ పాషా , అశ్వాపురం మండల అధ్యక్షులు షేక్ సత్తార్ బూర్గంపాహడ్ మండల మహిళా అధ్యక్షురాలు ఎండి పర్వీన్ , భద్రాచలం మండల అధ్యక్షులు మస్తాన్ , మండల గౌరవ అధ్యక్షులు ఉస్మాన్ , మజీద్ కమిటీ అధ్యక్షులు షాబాజ్, ప్రధాన కార్యదర్శి సమీ, పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా , అలీ ఖాన్ , ముదస్సిర్ , రెహమాన్ షరీఫ్ , షారుక్, తదితర జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: