మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సన్నిధిలో ఆదివాసీ తెగల సమ్మేళనం జనవరి 30,2022 న నిర్వహించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుదుందెబ్బ అధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగినది.సమ్మక్క,సారలమ్మ,పగిడిద్దరాజు,గోవిందరాజు,జంపన్న,నాగులమ్మ, క్రీ.శే.13 వ శతాబ్దంలో కాకతీయ సామ్రా జ్యవాదుల ఆర్థికదోపిడీ,అరా చకాలకు,బానిసత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీల స్వయం పాలన కొరకు పోరాడి వీర మరణం పొందినా,వీరి పోరాట స్ఫూర్తిగా రెండు సంత్సరాల కొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలు స్తున్నారు.ఆదేవతల సన్నిధిలో ఆదివాసీల,సంస్కృతి,సంప్రదాయాలు,అస్తిత్వం,హక్కులు,
చట్టాలను కాపాడుటకు ఆదివాసీల తెగలను ఐక్యత చేయాలనే ప్రధాన భూమికతో దేశం లో వున్న ఆదిమ తెగలను ఒక వేదికగా తీసుకు రావాలనే ధృడ నిశ్చయంతో శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు ముందు ఆనవాయి తీగా ఆదిమ తెగల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగు తుందనీ,ఈ సమ్మేళనంలో ఆదివాసి ఉద్యమ నాయకు లు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థి సంఘాల నాయకులు,మహిళ సంఘాల నేతలు పాల్గొం టారు.మాఘ శుద్ధ పౌర్ణమి ఫిబ్రవరి 16,17,18,19-2022 న జరిగే జాతరలలో ముంద స్తుగానే ఆదివాసీలకు సమాచారం ఇవ్వడం జరుగుతున్నది.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు అన్ని విధాలా అభివద్ధి చేయాల్సిన బాధ్యతను ఆదివాసి సంఘాలుగుర్తు చేస్తూ,జాతర ట్రస్టు బోర్డు చైర్మన్,సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమంలో ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గరావు,తుడుందేబ్బ జాతీయ కన్వీనర్ రమణల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,ప్రధాన కార్యదర్శి గుంపిడి.వెంకటేశ్వర్లు,ములుగు,మహబూబాబాద్,వరంగల్ జిల్లాల అధ్యక్షులు చింత కృష్ణ,మల్లెల రాము,గొంది నాగేశ్వరావు సీనియర్ నాయకులు పొడెంరత్నం,
మల్లెల రాంబాబు,పొదెం కృష్ణ ప్రసాద్,మంకిడి.బుచ్చయ్య,
చందా గోపాల్ రావు,చందా మహేష్,వట్టం సురేష్,వట్టం జనార్ధన్, సర్వేశ్వరావు,గడ్డం నాగభూషణం,వాసం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: