మన్యంటీవి, అశ్వారావుపేట: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఇంటింటి (హౌస్ టు హౌస్) ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. కరోనా థర్డ్ వేవ్ పంజా విరుచుకు విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫీవర్ సర్వేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మండల కోవిడ్ నియంత్రణ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రత్యేక అధికారి ఆర్డీవో స్వర్ణలత పర్యవేక్షించారు. ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తుల వివరాలు సేకరించి, వీరిలో కరోనా లక్షణాలు కలిగినవారికి హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేశారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారు. ఇదేవిధంగా మండలంలోని ఊట్లపల్లి, వేదాంతపురం అనంతరం గ్రామాల్లో కూడా సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీఓ సీతారామరాజు, పంచాయతీ, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: