మన్యం మనుగడ వాజేడు జనవరి 14.
-పేరూరు యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమిడి నర్సింహారావు చేతుల మీదుగా కొబ్బరి కాయ కొట్టి,రిబ్బన్ కట్ చేసి మ్యాచ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ మా పేరూరు గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా కొంత లేటుగా నిర్వహిస్తున్నాం దీనికి క్రీడాకారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉయ్యిక రమేష్ మాట్లాడుతూ,యువకులు ఆటలలో ప్రతిభ కనబర్చి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని, క్రీడాల్లో దేహాదారుడ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాలపై మక్కువ పెంచుకొని ప్రతి ఒక్కరు క్రీడలలో రాణించాలని, క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వికరించి క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలన్నారు. అలాగే విద్య తో పాటు కంప్యూటర్ రంగంలో అన్ని యుగాలలో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా డర్ర గణేష్,శేషు, బొల్లె ఆదినారాయణ, అట్టం రఘపతి,కుంట నర్సింహారావు,బొల్లె సంతోష్,రమేష్, పాపారావు, గడ్డం నాగేశ్వరావు వివిధ గ్రామాలనుండి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: