CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విశ్వాసఘాతుక దినం'ను విజయవంతం చేయండి .భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ

Share it:

 


మన్యం టీవీ వెబ్ డెస్క్:

ఈ నెల జనవరి 31వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపిచ్చిన 'విశ్వాసఘాతుక దినం'ను విజయవంతం చేయండి! మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటూ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా, మండల్, తహసీల్ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట మిలిటెంట్ ప్రదర్శనలు చేపట్టండి అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అభయ్ పేరిట లేఖ విడుదల చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా 2022 జనవరి 31వ తేదీన పిలుపునిచ్చిన 'విశ్వాసఘాతుక దినం'ను జయప్రదం చేయవలసిందిగా భాకపా (మావోయిస్టు) కేంద్ర కమిటీ యావత్తు దేశ రైతాంగానికీ పిలుపునిస్తున్నది. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మిక సంఘాలు ఫిబ్రవరి 23, 24 తేదీలలో ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయవలసిందిగా దేశ యావత్తు పీడిత వర్గాలు, పీడిత సామాజిక సెక్షన్లకు పిలుపునిస్తున్నది. రైతాంగానికి తల వంచిన కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటూనే కనీస మద్దతు ధర, దైతాంగ ఉద్యము కార్యకర్తలపై కేసుల ఉ వసంహరణ, ఆందోళన సమయంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం విషయాలపై హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఎంఎస్పీ విషయంలో ఎలాంటి కమిటీని నిర్మించడం కానీ, దాని స్వరూపం, పని విధానం ఎలా ఉంటుందో కూడా ప్రకటించలేదు. ఆందోళన సమయంలో రైతాంగంపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభించలేదు. హర్యానాలో 48,000 మందిపై 278 కేసుల్లో


పోలీసులు ఎఫ్ఎఆర్ ఫైలు చేశారు. ఇందులో 87 ఆర్లను ఉపసంహరించుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్


రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను మొత్తంగానే రేపట్టలేదు. ఆందోళన సమయంలో చనిపోయిన దాదాపు వేయి మంది రైతులకు నష్టపరిహారం ఇస్తానన్న


కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు.


లఖింపూర్ భేరీలో రైతాంగంపై మంత్రి అజయ్ మిశ్రా కొడుకు మూడు కార్లను ఆందోళనకారులపై నుండి తోని అరుగురు రైతులను హతమార్చారు.


ఆ తర్వాత తిరగబడిన రైతాంగంపై అనుచరులతో కలిసి జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. వారిని తిరగబడిన రైతాంగమే హత్య,


చేసిందంటూ ప్రభుత్వం వారిపై ఎన్టీఆర్ దాఖలు చేసింది. మంత్రి అజయ్ మిశ్రామ కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలన్న రైతాంగ


డిమాండ్ ను ప్రభుత్వం బేఖాతరు చేసింది.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న ఈ వైఖరికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 31వ తేదీన విశ్వాసఘాతక దినంగా ప్రకటించి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 23, 24 తేదీలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వివిధ కేంద్ర స్థాయి ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎంఎస్పీ కోసం చేస్తున్న డిమాండ్ను కూడా కలిపి, ఈ సమ్మెలో పాలు పంచుకోవలసిందిగా సంయుక్త సాన్ మోర్చా రైతాంగానికి పిలుపునిచ్చింది.


మా పార్టీ ఈ డిమాండ్లను సమర్థిస్తున్నది. ఈ ఆందోళనలలో పాలు పంచుకోవలసిందిగా దేశ ప్రజలకు పిలుపునిస్తున్నది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భాజపా ప్రభుత్వం వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకుందనే విషయం రోజు రోజుకూ మరింత స్పష్టమవుతున్నది. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న కొద్ది రోజులకే వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ తాము సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తామని ప్రకటించారు. ప్రభుత్వ వైఖరికి ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ సామ్రాజ్యవాద కనుసన్నలలో ప్రజలపై అణచివేతకు పూనుకుంటున్న దేశ దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వర్గాలకు, బడా భూస్వామ్య వర్గాలకు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమం నిర్మించవలసిన అవసరం ఉన్నది.


ఇందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 31వ తేదీన ప్రదర్శనలు, ర్యాలీలు జిల్లా, మండల్, తహసీల్లో

ప్రభుత్వ కార్యాలయాల ముందు జరపవలసిందిగాను, 23, 24 తేదీలలో దేశవ్యాప్త బంద్లో మిలిటెంటుగా పాల్గొనవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Share it:

TS

Post A Comment: