మన్యం మనుగడ ఏటూరు నాగారం
షెడ్యూల్డ్ ప్రాంతాల హక్కులకు విరుద్ధంగా గిరిజనేతరులు ఆక్రమించిన అటవీ,ఇతర భూములను,అక్రమ కట్టడాలను నిలిపివేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలం కిషోర్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..
షెడ్యూల్డ్ ప్రాంతాలలో1/70, ఎల్ టి ఆర్,వడ్డీ వ్యాపార నిషేధిత చట్టాలు అమలులో ఉన్నా గిరిజ నేతరులకు భూముల పట్టాలు,ఇళ్ల కట్టడాలను నిషేధించిన ఆ చట్టాలకు లోబడి పని చేయాల్సిన తహశీల్దార్ లు,వి ఏ ఓ లు పట్టాలు చేస్తూ,ఇళ్ల కట్టడాలకు పర్మిషన్స్ ఇస్తూ, పట్టాలను తహశీల్దార్ లు తారుమారు చేస్తూ గిరిజ నేతరులు ఇచ్చే లంచాలకు మరిగి ఎగబడి షెడ్యూల్డ్ ఏరియా ను సర్వ నాశనం చేస్తున్నారనీ అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఏటూరు నాగారం తహశీల్దార్, వి ఏ ఓ లపై చట్టపరమైన విచారణ జరిపి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలనీ లేని యెడల సిబిఐకి మా సంఘము తరపున ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతామని తెలియ జేస్తున్నాం,అని అన్నారు.
ఈ అక్రమ కట్టడాలు,భూ ఆక్రమణలు వివిధ పార్టీల నాయకుల కనుసన్నుల్లో జరుగుతున్నాయని వీరికి కూడా తగిన బుద్ధి చెబుతామని వీరి పేర్లు కూడా మా సంఘం దృష్టికి వచ్చాయని వీరు మర్యాదగా తమ పద్దతి మార్చుకోవాలని సూచిస్తున్నాం,మైదాన ప్రాంతాల్లో జరిగే రియల్ ఎస్టేట్ అని వ్యాపారలు షెడ్యూల్డ్ ఏరియాలో,చెల్లనేరవు అని,షెడ్యూల్డ్ ఏరియా పరిపాలన - హక్కులు ప్రత్యేకమైనవి,ఆ ప్రయోజనాల ను కాపడటమే మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని వాటి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కోర్ని బెల్లి గణేష్,
ఏ ఎస్ యు జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్,రాష్ట్ర కార్యదర్శి చర్ప రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: