గుండాల జనవరి 19 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని నరసాపురం తండాకు చెందిన బి.బాలాజీ(40) ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో సంక్రాత్రి పండుగ రోజు పురుగుల మందు తాగాడు కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు గురువారం మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన బాలాజీ కి 20 గుంటల భూమి ఉంది అందులో మిరప పంట వేయగా అది కూడా పూర్తిగా ఎంతో మనో వేదనకు గురయ్యాడు దీనికితోడు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉండడంతో తనకు పెండ్లి కూడా చేయలేనేమో అన్న మనోవేదనలో పురుగుల మందు తాగాడు. మృతుడికి భార్య బుల్లి, కూతురు మమత, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: