మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండల ప్రాథమిక వ్యవసాయ సంఘం సభ్యురాలు శెట్టిపల్లి బుజ్జమ్మ ఇటీవల మరణించడం జరిగింది. ఆమెకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార నుండి మంజూరైన లక్ష రూపాయల పరిహారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ కొండేరు రాము, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు , దాట్ల వాసు బాబు, ముక్కు వెంకట నర్సారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎగ్గడి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: