ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్):మండలం లోని రాచన్న గూడెం గ్రామ పంచాయతీ లోని ఆదివాసీ గ్రామం సాకివలస గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డ్ అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మహిళలను వివస్త్ర ను చేయడం అమానుషానికి పరాకాష్టని.సాకివాలస కు చెందిన 50సం ఎండ్ల వెట్టి లక్ష్మి,18 ఎండ్ల సొడే దేవమ్మ,16 సంవత్సరాల సోడే రజనీ పోయిలో కట్టెల కోసం అడవికి వెళ్లగా వీరిని చూసిన ఫారెస్ట్ గార్డ్ మహేష్ విచక్షణ మరచి ప్రవర్తించాడు. లక్ష్మి,రజనీ లను విపరీతంగా కొట్టాడు.దేవమ్మ ను తరిమితే గుంటలో పడిపోయిందని,అయినా వదిలి పెట్టకుండా ఆమె లంగా పట్టుకొని గుంజాడు దీనితో ఆమె వివస్త్ర రాలు అయ్యింది.ఈ ఘటన ఫారెస్ట్ వారి దౌర్జన్యాలకు పరాకాష్ట అని, పోయిలోకి కట్టెలు తెచ్చుకోవడం కూడా నేరమా? అడివిని మేస్తున్న బడా కంపెనీలను,బడా బాబులను కాపాడుతూ,నోరులేని అమాయక ఆదివాసుల మీద ఇంత దాస్టికమా, అని ఫారెస్ట్ బీట్ గార్డ్ మహేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.ఈ ఘటన పై పూర్తి విచారణ జరపాలని,గాయపడ్డ మహిళకు వైద్యం అందించాలని,ఈ ఘటనతో సభ్య సమాజం ఫారెస్ట్ వారి అమానుషాన్ని ఖండించాలని తెలియజేసారు.
Post A Comment: