మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ గ్రామ ప్రజలు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి ఘన స్వాగతం పలికారు. తొలత బంగారుగూడెం గ్రామంలో కరకగూడెం ఎంపిడిఓ శ్రీనివాస్ ఐటిడిఎ డిఈ రాములు తో ప్రత్యేక సమావేశం నిర్వహించి మండలంలో గ్రామాలలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి కొత్త అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. బంగారుగూడెం గ్రామంలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇంటి స్థలాలు పరిశీలించారు. అలాగే కన్నాయిగూడెం గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి అక్కడ స్థానికంగా ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక ,స్థానిక సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: