CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్షతను వీడాలి:ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్షతను వీడాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు,ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు లో భాగంగా గురువారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో పినపాక,కరకగూడెం, మణుగూరు మండల ఎంపీడీవో లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భం గా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు అర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలు, సంస్థలు,కార్పొరేషన్లలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల కు మరియు క్యాజువల్ లేబర్,డైలీ వేజ్ వర్కర్స్,హోంగార్డులు,అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,ఆశా వర్కర్స్ తదితర వారందరికీ వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం,గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు.ప్రతిరోజు చెత్త లో దుమ్ము,ధూళిలో పనిచేస్తూ,తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ,ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు సరైన వేతనాలు గాని,వైద్య సౌకర్యం గాని,పిఎఫ్, ఇన్సూరెన్స్,పని భద్రత లాంటి సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలకు తెగించి,విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల వివక్షతను విడనాడి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు.ఆ లోపు జీవో నెంబర్ 60 లో పేర్కొన్న విధంగా వివిధ కేటగిరీలకు నిర్ణయించిన వేతనం 15,600 రూపాయలు, 19,500 రూపాయలు, 22,750 రూపాయలు,గ్రామపంచాయతీలో పనిచేస్తున్న వారందరికీ ఇవ్వాలని,జీవో నెంబర్ 51 సవరించి,మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్,బిల్ కలెక్టర్ లకు ప్రత్యేక హోదా కల్పించాలని, పీఎఫ్,ఈఎస్ఐ లతోపాటు ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలకు,గ్రామపంచాయతీ కార్మికులు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో,గ్రామపంచాయతీ కార్మికులు ముత్తయ్య, బాలరాజు,చంటి,సుమన్,రవి, సమ్మయ్య,సంపత్,బూరా.శ్రీను,భాస్కర్ శంకర్,రామనాథం, వెంకటేష్,రామకృష్ణ,నాగరాజు,లక్ష్మయ్య,బుచ్చిబాబు,పి.నాగరాజు,వై.పిచ్చయ్య,సాంబశివరావు,కె.ప్రశాంత్,యు.సాంబశివరావు,జి.కృష్ణ,సమ్మయ్య,నరేష్,శంకర్, రాములు, ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: