CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్తున్నారా దొంగల తో జర జాగ్రత్త !!-అప్రమత్తత అతి ముఖ్యం.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:వృత్తి, వ్యాపార రీత్యా, పిల్లల చదువుల కోసం స్వగ్రామాన్ని వదిలి వుండే వారు, జీవనోపాధి కోసం వచ్చి వుండే వారు, సంక్రాంతి పండగ వేల, ఇంటికి తాళం వేసి తమ స్వగ్రామాలకు వెళ్లి, ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుని తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటిలో దొంగ తనం జరిగి ఇంట్లో దాచుకున్న సొమ్ములు, బంగారు నగలు దోచుకుని పోవడం...ఇంటి యజమానులు తీవ్ర ఆందళనకు గురి కావడం జరుగుతుంటుంది. కావున పండక్కి తమ ఊర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ క్రింది జాగ్రత్తలు పాటించ వలసినదిగా అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేంద్ర రావు కొన్ని సూచనలు చేశారు. 1) సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్లాలనుకునేవారు సాధ్యమైనంతవరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకుండా, ఇంటి వద్ద ఎవరో ఒకరు ఉండేలా చూసుకోవాలి. విధిగా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి. 2)ఒకవేళ ఇంటివద్ద ఎవరిని ఉంచే పరిస్థితి లేకపోతే, పక్క ఇంటివారినైనా తమ ఇంటి వైపు చూడమని చెప్పాలి. పోలీస్ వారికి కూడా సమాచారం ఇవ్వండి. 3)ఊరికి వెళ్లేముందు ఇంటిలో ఎక్కువ మొత్తంలో నగదు/ రూపాయలు, బంగారు ఆభరణములు ఉంచకుండా జాగ్రత్త వహించాలి. 4)వీలైతే బ్యాంకు లాకర్ లో నగదును మరియు బంగారు ఆభరణములను దాచుకుని వెళ్ళవలెను. 5) బ్యాంక్ లాకర్ లేని వారు నమ్మకం ఉన్న బంధువులు లేదా స్నేహితుల వద్ద ఉంచి వెళ్ళవలెను. 6) పండుగల వేళ బస్ స్టేషన్లు కిక్కిరిసి ఉండటం సహజం. ఆ సమయంలో బస్సు ఎక్కే క్రమంలో దొంగలు మీ పక్కన తోసుకుంటూ వెళ్లి మీ పాకెట్ లో ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్లు కొట్టివేయడం మరియు మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు తెంపుకొని పారిపోవడం చేస్తుంటారు. కావున బస్సు ఎక్కే సమయంలో మిమ్మల్ని తోసుకుంటూ వెళ్లే వారి పై మరియు మీ విలువైన వస్తువుల మీద దృష్టి పెట్టవలెను. 7) కొంతమంది తమ విలువైన బంగారు ఆభరణాలు మరియు నగదు ఉన్న బ్యాగ్, పర్సును, సంచీని లేదా సూట్ కేస్ లను బస్సు సీట్ లో ఉంచి, నీళ్ల బాటిల్ కొనుక్కోవడానికి, వాష్ రూమ్ కి వెళ్లడానికి లేదా టీ తాగి రావడానికి బస్సు సీట్ లో బ్యాగును వదిలి వెళ్తుంటారు. బస్సు సీటు బ్యాంకు లాకర్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అలా బ్యాగ్ వదిలి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి బస్సు సీటు లో తాము పెట్టిన తమ విలువైన ఆభరణాలు గల నగదు ఉన్న బ్యాగు మాయమైపోయే అవకాశం ఉంది. సీటుపై ఆశ మొదటికే మోసం తెచ్చే అవకాశము ఉంటుంది. కావున అప్రమత్తంగా ఉండవలెను. 8) ప్రతి పండుగకు పోలీస్ లు పలు సూచనలు ఇచ్చినప్పటికీనీ, కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల పలుమార్లు దొంగతనాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నవి కాబట్టి అప్రమత్తం గా ఉంటే ఎలాంటి సమస్యలు రావు, కావున పోలీసుల సూచనలు పాటించండి మీ ఇల్లు భద్రంగా ఉంచుకోండి.

Share it:

TS

Post A Comment: