గుండాల/ఆళ్ల పల్లి జనవరి 19 (మన్యం మనుగడ) చాలా రోజుల తర్వాత నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మండలంలోని కొందరు అధికారులు కొట్టాడు. అటవీశాఖ, ఐటీడీఏ ఏ ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి సమావేశం నిర్వహిస్తుంటే అధికారులు మాత్రం అలసత్వం వహించి సమావేశానికి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అన్నారు. హాజరు కాని అధికారుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వచ్చిన అధికారులతో సమావేశం లో చర్చించి అభివృద్ధిపై సమీక్ష చేశామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంగమ్మ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
Post A Comment: