CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాహన రంగంలో భార్గవ ఆటోమొబైల్స్ మరింత రాణించాలి.సంస్థ ఉద్యోగులందరికీ జనతా బీమా పథకం అమలు.

Share it:

 



 


  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం మనుగడ మణుగూరు.

వాహన రంగంలో భార్గవ ఆటోమొబైల్స్ హీరో షోరూం మరింత రాణించాలని ఆ దిశగా యాజమాన్యం మరియు ఉద్యోగులు శ్రమించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు గురువారం మణుగూరులో శ్రీ భార్గవ ఆటో మొబైల్స్ హీరో షోరూం స్థాపించి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ పడిలో  అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ప్రమాదం ఉన్న సమయంలో వ్యాపార రంగం ఎన్నో ఒడిదుడుకులు  వస్తున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా భార్గవ ఆటోమొబైల్స్ యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం చేసిన కృషి మర్చిపోలేనిదన్నారు రాబోయే రోజుల్లో మణుగూరు శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ మరియు ఏడూళ్ల బయ్యారం లోని శ్రీ లక్ష్మీ మోటార్స్ ఆహ్లాదకరమైన పోటీపడి మార్కెట్ అంచనాలను మించి వ్యాపారం కొనసాగించాలని ఆకాంక్షించారు వాహన యజమానులు వినియోగదారుల అవసరాలు మరియు అభిరుచులకు అనుగుణంగా సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు ఈ సందర్భంగా భార్గవ ఆటోమొబైల్స్ ఎండి నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ  సంస్థ యాజమాన్యం ఉద్యోగులు తనకు రెండు కళ్లతో సమానమని వారి సంక్షేమానికి పాటుపడతానన్నారు వాహన యజమానులు  వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిత్యం సేవలు అందిస్తామని అన్నారు శ్రీ రామ్ ఫైనాన్స్ మేనేజర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహన రంగంలో నూతన రుణాలు మంజూరు చేసేందుకు తమ సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ మోటార్స్ యజమాని భార్గవ్ రెడ్డి సంస్థ ఉద్యోగులు కోటేశ్వరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: