మన్యం టీవీ మణుగూరు:
సమయానికి జీతాలు పడకపోతే,తమ కుటుంబాల ను ఎలా బ్రతికించుకోవాలని ప్రశ్నిస్తూ,పీకే ఓసి భారీ యంత్రాల ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు,పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారులను ప్రశ్నించారు.ఈ మేరకు ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో సాయంత్రం మూడు గంటలకు పీకే ఓసి మెయిన్ గేట్ వద్ద కొద్దిసేపు నల్లబ్యాడ్జీలు ధరించి,నిరసన తెలిపారు.నిబంధనల ప్రకారం ప్రతి నెల 7వ తేదీలోగా జీతాలు కాంట్రాక్ట్ కార్మికుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని షరతు వున్నప్పటికీ,అది అమలు కావడం లేదని, జీతాలు ఆలస్యమైతే తమ కష్టాలు చెప్పలేనివి కాదని,ఇల్లు గడవక కొంతమంది,దినసరి కూలి పనికి వెళ్తున్నారని,వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు,సబ్ కాంట్రాక్టర్ల, మధ్య తాము, నలిగిపోతున్నామని వారు వాపోయారు.ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు ఏ. మంగీలాల్ మాట్లాడుతూ,పీకే ఓసి పరిధిలో భారీ యంత్రాల ట్రాక్ క్లీనింగ్,క్యాంటీన్,ఏజెంట్ కార్యాలయం,మరియు,మణుగూరు ఓసి ట్రాక్ క్లీనింగ్, ఏరియా హాస్పిటల్ తదితర కాంట్రాక్టర్లు కూడా ఇంకా జీతాలు చెల్లించలేదని, వేతనాలు అందక వారి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను కూడా ఆస్వాదించలేకపోయారని అన్నారు.యాజమాన్యం స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించాలని,ఆయన కోరారు.అనంతరం పికె ఓసి ప్రాజెక్టు అధికారి తాళ్లపల్లి. లక్ష్మీపతి గౌడ్ మరియు ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు కు వినతి పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.మంగీలాల్, పరాల శ్రీనివాస్,ఎం.ఉప్పయ్య, డేగల.రాజేంద్ర బాబు,వి.రాజు, ప్రవీణ్,నివాస్,అశోక్,ప్రసాద్,జనార్ధన్,ఉదయ్,జి.రాజు,సారయ్య,హరికృష్ణ,శివ చరణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: