CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే సీతక్క మంజూరు చేయించిన రోడ్డు మేమే తెచ్చాము అని తెరాస నాయకులు ఫొటోలకు పోజులు ఇవ్వటం సిగ్గు చేటు.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండలం లో కోమటి పల్లి క్రాస్ ఈరోజు మంగపేట మండలం లో కోమటి పల్లి క్రాస్ ఆర్ అండ్ బి నుండి కోమటి పల్లి వరకు మంజూరు అయిన రోడ్డు విషయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే చేయించామని చెప్పుకోవడం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి అన్నారు. కోమటి పెళ్లి రోడ్డు ములుగు ఎమ్మెల్యే సీతక్క కృషి చొరవతో మంజూరు కావడం జరిగింది. గత మూడు నెలల క్రితమే కలెక్టర్ ద్వారా కోమటిపల్లి తోండ్యాల కొత్తూరు మోట్ల గూడెం కాటాపూర్ వెళ్ళే దారిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఎన్నో సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వివరించడం జరిగింది . ఇదే దారిలో ముక్కిడి పోచమ్మ గుడి వుంది నిత్యం ప్రజల తో రద్దీగా ఉండే రోడ్డు అని కలెక్టర్ కు తెలియజేయడం జరిగింది . ఈ రోడ్డు విషయంలో మండల తెరాస నాయకులు అధికారుల దృష్టికి గాని కలెక్టర్ దృష్టికి గాని తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయా ఎమ్మెల్యే సీతక్క చొరవతో మంజూరు అయిన రోడ్డుకు టిఆర్ఎస్ నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. మీరు రోడ్డు మంజూరు చేయించినట్లయితే ముక్కిడి పోచమ్మ దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధమేనా. ఎమ్మెల్యే సీతక్క ఈ రోడ్డు మంజూరు చేయించారని ప్రమాణం చేయడానికి మేము సిద్ధం మీకు దమ్ము ధైర్యం ఉంటే కోమటి పల్లి నుండి కాటాపూర్ వరకు ప్రభుత్వం తో కొట్లాడి మంజూరు చేయించగలగే ధైర్యం మీకుందా మండలం టిఆర్ఎస్ నాయకులు ఏనాడైనా ఈ రోడ్డు విషయమై ప్రజల సమస్యలపై అధికారులకు గాని కలెక్టర్ కి వినతి పత్రం అందించారా కనీసం దృష్టి కి తీసుకు వెళ్లారా చెప్పాలి ప్రజల సమస్యలు పట్టని మీరు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరీ యానయ్య యస్ టి సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయ్ తుల్ల ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు నాయకులు పోదేం నగేష్ మాసిరెడ్డి వెంకట్ రెడ్డి దామేర సారయ్య కారు పోతుల నర్సయ్య గౌడ్ మార్పుల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: