CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులుగా ఆదివాసీ బిడ్డ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నేడు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా టిఆర్ శ్రేణుల సంబురాలు.

Share it:

 



మన్యం మనుగడ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులుగా ఆదివాసీ బిడ్డ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించారు. దీనితో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా టీఆరెస్ శ్రేణులు, రేగా అభిమానులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

*విప్ రేగా కాంతారావు బయోడేటా*

ప్రొఫైల్ పేరు:: రేగా కాంతారావు


భార్య: సుధారాణి(టీచర్)


తల్లి:నరసమ్మ


తండ్రి: బొర్రయ్య(లేటు)


పుట్టిన తేదీ: 09-04-1977


సంతానం: నవదీప్ దొర, వ్యోమ చంద్రదీప్ దొర


రాజకీయనేపథ్యం : చిన్నతనం నుండి కాంగ్రెస్ అభిమానిగా ఉన్న రేగా కాంతారావు 2009 సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్తవారికి టికెట్ ఇస్తుందన్న సమాచారం గ్రహించి.. ప్రయత్నించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంతారావు ఉత్సాహం, శక్తిని గ్రహించి టికెట్ ఇచ్చారు. అరంగేంట్రంలోనే వైఎస్ఆర్ నమ్మకాన్ని నిజం చేసి పాతికేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేశారు. 2014లో పొత్తుల కారణంగా సీటు త్యాగం చేయగా, 2018లో పోటీచేసి మళ్ళీ బంపర్ విక్టరీ సాధించారు. ఆయన

అడుగుపెడితే విజయమే. పోటీచేస్తే ప్రభంజనమే అన్నట్లు భద్రాద్రి ఏజెన్సీ రాజకీయాలు మారాయి. ఇప్పుడు అధికార

టీఆర్ఎస్పార్టీలో కీలక ఆదివాసీ నేతగా గుర్తింపుపొందారు.

కాంతారావు చురుకుదనం గ్రహించి సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు ప్రభుత్వ విప్ గాబాధ్యతలు అప్పగించారు. తన పనితీరుతో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన్ననలు అందుకుంటున్నారు.నేడు భద్రాద్రి జిల్లా టీఆరెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడం రేగా పని తనానికి నిదర్శనం.

*పట్టుబడితే వదిలి పెట్టడు*

రేగా కాంతారావు ఏదయినా పట్టు బడితే వదలడు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండో దఫా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల అభివృద్ధి కి నిధులు తీసుకరవడం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎప్పడు కలవాలసిన సందర్భం వచ్చినప్పుడు అనేక ప్రజా సమస్య లు తన వెంట తీసుకవేల్లుతాడాని సహచర ఎమ్మెల్యేలు మట్లాడుకోవడం రేగా పని తనానికి నిదర్శనం.

*ఇద్దరి ముఖ్యమంత్రుల మనుసు గెలిచిన రేగా కాంతారావు*

రేగా కాంతారావు ఓ శక్తి అండడం లో ఏలాంటి అతిశయోక్తి లేదు.రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన కాలం లో ఏలాంటి బేరకు లేకుండా రాణించి విమర్శకులు సైతం విస్మయం చెందేలా దీసుకపోయాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పినపాక నియోజకవర్గానికి రప్పించి వేలకోట్ల అభివృద్ధి నిధులు రప్పించి అప్పుడే పినపాక నియోజ వర్గాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఆ తర్వాత మరీనా రాజకీయ సమీకరణాలు రేగా కాంతారావు సిట్టింగ్ సీటు కోల్పోయాడు.రేగా ఎదుగుదల ను ఓర్వలేని కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఐనా ఏమాత్రం క్రుంగి పోకుండా ప్రతిపక్షంలో ఉండి పినపాక నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాడారు. ప్రజలను అంటిపెట్టుకొని ఉన్నారు.

*హై డ్రామా మధ్యన రేగా కాంతారావు కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం*

ఒక మారు రేగా కాంతారావు రాజకీయ సమాధి చేయాలని చూసిన కాంగ్రెస్ అధిష్టానం 2018 లో సైతం మరో మారు టికెట్ విషయంలో మోసం చేసే ప్రయత్నం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ సాధించడానికి ఆయన భగీరథ ప్రయత్నం చేశారు. అనేక అవమానాలు,రేగా అనుచరుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది.2018 లో భారీ విజయం నమోదు చేశారు.

*నాడు టీఆరెస్ లో చేరుతా అంటే అనుచరులు అడ్డుకున్నారు*

రేగా కాంతారావు టీఆరెస్ పార్టీలో చేరాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని ఆయన ముఖ్య అనుచురుల ద్వారా తెలియవచ్చింది. ఐతే కొంతమంది అడ్డు చెప్పడంతో రేగా కాంతారావు తన నిర్ణయాన్ని వేన్నక్కి తీసుకున్నట్లు తెలిపారు.

*పదవులు కొత్తేమి కాదు*

రేగా కాంతారావు లో నాయకత్వ లక్షణాలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవలను రాష్ట్ర దేశవ్యాప్తంగా వినియోగించుకుంది.గతంలో ఛత్తీస్ గడ్ ,ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గా ,ఏ ఐ సీసీ మెంబర్ గా కొనసాగారు.

Share it:

TS

Post A Comment: