మండల ప్రత్యేక అధికారి సంజీవరావు... చంద్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గ్రామాలలో పచ్చని అందాలు పెంపొందించడం కోసమే బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చెయటం జరిగిందని మండల ప్రత్యేక అధికారి సంజీవరావు అన్నారు. గురువారం బెండాలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన బృహత్ పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటే కార్యక్రమం ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రూ. 42 లక్షల అంచనా వ్యయంతో ఉపాధిహామీ పథకంలో ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా తయారైతే చిన్న అడవులను తలపించే విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు రసూల్, ఎంపీటీసీలు దారా బాబు, బోర్ర లలిత, సర్పంచులు పూసం వెంకటేశ్వర్లు, మలిపెద్ది లక్ష్మి భవాని, ఎంపీడీఓ అన్నపూర్ణ, సీడీపీఓ నిర్మలజ్యోతి,ఈ ఆర్ డి ఓ తులసి రామ్, పంచాయతీ కార్యదర్శులు సతీష్ కుమార్, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: