చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: గుండెపోటుతో పంట చేనులో రైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన రైతు శీలం ప్రతాప్ రెడ్డి (53) మిరపతోటకు నీరు పెట్టేందుకు ఆదివారం సాయంత్రం వెళ్లి తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా మిరపతోట లోనే ప్రతాప్ రెడ్డి చనిపోయి ఉండటాన్ని గమనించారు. గత రెండేళ్లుగా వ్యవసాయంలో పంట నష్టం రావడం, అప్పులు కావడం ఈ ఏడాది వేసిన మిరపతోట సైతం ఆశించిన విధంగా లేకపోవడంతో గుండెపోటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య నారాయణమ్మ, ఇద్దరు సంతానం కలరు.
Post A Comment: