- కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్సీ పల్లా.
- టీఆర్ఎస్ కార్యకర్తను సొంత ఇంటి సభ్యులుగా భవిస్తూ సహకారాన్ని అందించిన పల్లా.
- తండ్రి కోల్పోయిన ఇద్దరు ఆడపిల్ల కు 5 లక్షల ఫిక్స్ డిపాజిట్ చేసిన మానవత్వం చాటుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.
*మన్యం మనుగడ ఏటూరు నాగారం*
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్,ములుగు నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్చార్జి కుసుమ జగదీష్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో రైతుబంధు కార్యాలయంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగారూపాయలు,5,00,000/-ఐదు లక్షలు రాజకుమార్ కుటుంబ సభ్యులకు తల్లి కుసుమ లక్ష్మి,భార్య కుసుమ స్వాతి,కుమార్తె దీక్షితలకు అందజేయడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన కుసుమ రాజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త,వరంగల్,ఖమ్మం,నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల సన్నాహక సమావేశానికి ఏటూరు నాగారం కు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించి నాడు.కుసుమ జగదీష్ ద్వారా వేదిక పైన విషయం తెలుసు కున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ములుగు ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో సభ సాక్షిగా కుటుంబానికి అండగా ఉంటాం అని మాట హామీ ఇచ్చారు.
ఈ రోజు రాజకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఇద్దరు కుమార్తెలు ఇరువురికి 2 లక్షల 50 వేల రూపాయల చొప్పున మొత్తం 5,00000/- లక్షల రూపాయలు వారు మేజర్లు అయ్యేంతవరకు ఉండేవిధంగా ఫిక్సడ్ డిపాజిట్ చేసిమాట ఇచ్చి పల్లా రాజేశ్వర్ రెడ్డి నెరవేర్చారు.తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం, ఆడపిల్లలకు,చిన్నారులకు,భార్యకు,తల్లిదండ్రులకు,నిలబెట్టుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మానవత్వం చాటుకోవ డంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.కుసుమ రాజు కుటుంబ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్,పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మ మల్లారెడ్డి, వైస్ ఎంపిపి తుమ్మ సంజీవ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్,ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య తదితరులు ఉన్నారు.
Post A Comment: