CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిర్చి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి--జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి..

Share it:


  •  సుగంధ పంట రైతుల కోసమే స్పైసెస్ బోర్డు
  •  డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి లింగప్ప
  •  పంటమార్పిడి తోనే మిర్చి లో తామర పురుగు నివారణ
  •  కె.వి.కె కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ

మన్యం మనుగడ, పినపాక:

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నష్టాల్లో కూరుకుపోయిన మిర్చి రంగాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వాలు విశేషంగా కృషి చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు బుధవారం ఆయన స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో పినపాక మండలంలోని జానంపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన ఒకరోజు రైతు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు స్పైసెస్ బోర్డ్ నుండీ త్వరలోనే టార్పాలిన్ శిల్పాలిన్ పట్టాలను సబ్సిడీపై మంజూరు చేస్తామన్నారు హరిజన గిరిజన రైతులకు 75 శాతం సబ్సిడీపై పరదాల పంపిణీ ఉంటుందని తెలిపారు వెనుకబడిన భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలలో స్పైసెస్ బోర్డు మరియు కృషి విజ్ఞాన కేంద్రం సేవలను మరింత వేగవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను సాంబశివ రెడ్డి కోరారు సుగంధ పంటలను అభివృద్ధి చేసి సుగంధ పంటలను సాగు చేస్తున్న రైతుల అభ్యున్నతి కోసమే స్పైసెస్ బోర్డు పలు రకాల పథకాలను అమలు చేస్తోందని స్పైసెస్ బోర్డు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి లింగప్ప అన్నారు ప్రస్తుత తరుణంలో మిర్చి రైతుల కోసం విరివిగా రైతు శిక్షణ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పంటకోత అనంతర యాజమాన్య పద్ధతులలో భాగంగా మిర్చి రైతుల కోసం రాపిడ్ డ్రయర్లను అదేవిధంగా టార్పాలిన్ శిల్పాలిన్ పదాలను రాయితీపై పంపిణీ చేస్తున్నామని పసుపు రైతుల కోసం స్టీమ్ బాయిలర్ పాలిషర్ లను సబ్సిడీపై మంజూరు చేస్తున్నట్లు తెలిపారు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శ్రీమతి డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో తామర పురుగు సమస్య మిర్చి రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితులలో తామర పురుగు నివారణ కోసం విరివిగా ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు దాంతోపాటు పది వేల పిపీయం వేప నూనెను విధిగా చెట్టు మొత్తం తడిసేలా పిచికారి చేసుకోవాలన్నారు ఎలాంటి పరిస్థితుల్లోనూ బయో మందులను వినియోగించవద్దని రైతులకు పదే పదే సూచించారు కొత్తగూడెం ఏరువాక కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి శివ మాట్లాడుతూ మిర్చి లో తామర పురుగు నివారణకు పిప్రొనిల్ 80 శాతం 100 మిల్లీ లీటర్లు చొప్పున ఎకరాల విస్తీర్ణానికి పిచికారి చేసుకోవాలని తెలిపారు జెనీలియా మందు 200 మిల్లీ లీటర్లు ఎకరాల విస్తీర్ణానికి పిచికారి చేసుకోవాలన్నారు మిర్చి కి పిచికారి చేసే పురుగుమందులు పిచికారీ పిచికారి మధ్య కనీసం పది రోజుల సమయం ఉండాలని రెండు రోజుల వ్యవధిలో పిచికారి చేయడం వల్ల అప్పులపాలు కావడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని డాక్టర్ శివ అన్నారు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల సాంకేతిక అధికారి నాగేశ్వరరావు తమ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న పలు రాయితీ పథకాలను వివరించారు అనంతరం జానంపేట భూపతి రావు పేట గ్రామాల్లో ఉన్న మిర్చి పంట పొలాల క్షేత్రాలను పరిశీలించి స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ చైర్మన్ పొనుగోటి భద్రయ్య సహకార సంఘం చైర్మన్ ముదునూరి రవిశేఖర్ వర్మ జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ అభ్యుదయ రైతు వెల్లంకి నరసింహారావు సుమారు 70 మంది మిర్చి రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: