మన్యం మనుగడ, ములకలపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వలస గ్రామం ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం డి ఎఫ్ ఓ రంజిత్ నాయక్ కిసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజా ప్రజల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ప్రసంగిస్తూ ఎట్టి లక్ష్మి సోడే దేవమ్మ సోడే రజిని పొయ్యిలో కట్టెల కోసం అడవి కి వెళ్లి కట్ట నడుస్తున్న సమయంలో లో ఫారెస్ట్ గార్డ్ మహేష్ అనే వ్యక్తి లక్ష్మీ ,దేవమ్మ, లను విచక్షణ రహితంగా కొట్టి మైనర్ బాలిక అయినటువంటి రజిని భయంతో పారి పోతూ గుంటలో పడి న కనీస మానవత్వం లేకుండా వివస్త్రను చేయడం సిగ్గు చేటుఅన్నారు .ఒక మైనర్ బాలికను వివస్త్రను చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వారు విమర్శించారు. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలను చిత్ర హింసలకు గురిచేయడం మంచిది కాదని వారు విమర్శించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అడవిని నమ్ముకుని అడవిలో జీవిస్తూ ఆకులు అలములు తింటూ అడవిలోనే ఉంటున్నా ఆదివాసీలు పొయ్యి లో కట్టెలు కొట్టుకోవడం తప్పా వారన్నారు బడా పెట్టుబడిదారులు బడా కంపెనీలకు పాలకవర్గాలు ప్రజా భూములను ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తుంటే అధికార దాహంతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే పట్టించుకోని వీళ్ళు అమాయకులైన ఆదివాసీలను కూటికోసం వివస్త్రను చేసి ఇ నిలబెట్టడం సిగ్గుచేటని వారన్నారు. అడవులను సర్వ నాశనం చేస్తూ కంపెనీలో ఎగ్జిబిషన్లు పర్యాటక కేంద్రాలు చేస్తూ అడవి చిద్రం చేస్తుంటే పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు పొట్ట కోసం ఒక ఒక కొట్టుకోవడమే నేరం అయిందని వాళ్లను చిత్రహింసలకు గురి చేయడం సరైంది కాదని వారన్నారు తక్షణమే ఆడవాళ్ల అని కనికరం కూడా లేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఫారెస్ట్ గార్డ్ మహేష్ ను తక్షణమే విధుల నుండి బహిష్కరించాలని ఆదివాసి బిడ్డల లక్ష్మీ ,దేవమ్మ ,రజిని లకు న్యాయం చేయాలని వారన్నారు తక్షణమే దీనిపై విచారణ కొనసాగించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని ఆదివాసుల రక్షణ కల్పిస్తారని కోరుతున్నాం .ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అవుతాయి ప్రజాగ్రహానికి ఫారెస్ట్ అధికారులు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. *డిఎఫ్ఓ మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తామని తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ వినతి పత్రం కార్యక్రమంలో గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్ కె ఉమార్ యాసారపు వెంకన్న రాంచంద్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: