CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి, మొక్కజొన్న,వరి,పత్తి పంటలకు నష్టపరిహారం చెల్లించాలి-- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,అఖిలభారత రైతుకూలి సంఘం డిమాండ్

Share it:



మన్యం వెబ్ డెస్క్:

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో నిన్న రాత్రి అకాల రాళ్ల వర్షంతో మిర్చి, మొక్కజొన్న,పత్తి,వరి,బీర,కాకర,టమాటా తదితర కూరగాయల పంటలు వర్షం తాకిడికి చిన్నాభిన్నమై ధ్వంసమైనాయి అని తతక్షణమే జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని పంటలు నష్టపోయిన రైతుల సర్వే ప్రక్రియను చేపట్టాలని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నాయిని రాజు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొమరారం ఏరియా కమిటీ కార్యదర్శి ఈసం భద్రన్న కొమరారం ఎంపిటిసి అజ్మీర బిచ్చ అఖిల భారత రైతుకూలీ సంఘం మండల కార్యదర్శి బుర్ర వెంకన్న డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ,అఖిలభారత రైతుకూలి సంఘం నాయకుల బృందం కొమరారం ఏరియాలో పోచారం,అమర్ సింగ్ తండా ,మాణిక్యం, బొంబాయి తండా,పోలారం,మర్రిగూడెం కాల్నీ తండా తదితర గ్రామాలలో వర్షాలకు పడిపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే మిర్చి వేసిన రైతులు చీడపీడల తో నులిపురుగుల తో పంట నష్టానికి గురై తీవ్ర మనోవేదన చెందుతున్న క్రమంలోనే ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో రైతు కు మరింత నష్టాన్ని చేకూర్చిందని దీనితో రైతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు అని వారు అన్నారు. ఈ వర్షాలతో తడిసిపోయిన మిర్చి పత్తి వరి ధాన్యం కూరగాయ పంటలు పూర్తిగా నష్టపోయాయి అని ఈ నష్టాల నుండి రైతులు బయట పడాలంటే ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరి వీడి రైతు పక్షాన నిలబడి వారికి భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వాణిజ్య పంటలు వేసిన రైతులు ఎకరాకు ఒక లక్ష రూపాయలు ఇతర పంటలు వేసిన రైతులకు కనీసం యాభై వేలు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో PDSU బద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు మండల నాయకులు బుర్ర రాఘవులు,కాంపాటి ప్రసాద్,వాంకుడోత్ శంకర్,తుడుం శ్రీను, స్థానిక రైతులు గడ్డం రవి,కేలోతు జీవుల,అజ్మీర బిచ్చ,జర్పుల సురేష్,వాంకుడోత్ బుండి కేలోతు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: