మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు ఆట వస్తువులను, తినుబండారాలను పంపిణీ చేయడం జరిగింది. పిల్లలకు కావాల్సిన, ఆహ్లాదాన్ని కలిగించే టెడ్డీబేర్,వివిధ రకాల నిత్యం వాడే వివిధ రకాల ఆటవస్తువులను ఉప సర్పంచ్ అండెం నాగిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏసోబు, రవి , మరియమ్మ, జి టి ఎస్ ఎస్ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: