CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లా ను పర్యాటక జిల్లా గా అభివృద్ధి పరుస్తున్నాము

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలబెట్టిన సీఎం కేసిఆర్ జిల్లాకొక ప్రధాన పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పర్యాటక రంగంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దే ప్రణాళిక చేస్తున్నా రని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,

గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి,24 కాటేజ్ లు, గ్లాస్ కాటేజ్ లను మంత్రులు శనివారం ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రంలో గట్టమ్మ,

లక్నవరం,మేడారం,తాడ్వాయి,దామర్వాయి,మల్లూరు,బొగత జలపాతాలను,ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు ఇంటి గ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు ప్రాజెక్టును కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల భాగస్వా మ్యంతో 79.87 కోట్ల రూపాయలతో చేపట్టామని,ఇందులో భాగంగా లక్నవరంలో 27.65 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లా డుతూ.లక్నవరం చెరువుపై బ్రిడ్జి ప్రారంభం చేయడం సంతోషంగా,ఉందని అన్నా రు.పర్యాటక శాఖ మంత్రిగా చందూలాల్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని,మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిని కొనసా గిస్తున్నా రని,ఇక్కడ జరుగుతున్న అభి వృద్ధి చూస్తుంటే ఎక్కడున్న వరంగల్ ఎక్కడ పోయింది అనిపిస్తుందని అన్నారు.

ముఖ్య మంత్రి కేసిఆర్ పర్యాటక ప్రేమికులు కావడం వల్ల ఈ ట్రైబల్ సర్క్యూట్ ప్రాంతాలు గొప్ప పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చెందు తున్నాయని,800 ఏళ్ల క్రితం కట్టిన రామప్పకు ఎంతో కష్టపడి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు.ఈ పర్యాటక ప్రాంతాల వల్ల ఈ సర్క్యూట్ బాగా అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసిఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చూస్తే మనం తెలంగాణలో ఉన్నామా? వేరే దేశంలో ఉన్నామా?అన్నట్లు ఉందని అన్నారు.ఇన్ని సంవత్సరాలు వీటిని పట్టించుకోక ప్రాచుర్యంలోకి రాలేదు అన్నది ఇప్పుడు తెలుస్తుందని అన్నారు.

తెలంగాణ వచ్చాక ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా వృద్ధిలోకి వస్తున్నాయని అన్నారు.తెలంగాణ వచ్చాక సీఎం కేసిఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు,పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు వచ్చిందని.తొందరలో లక్న వరంలో అధునాతన పెద్ద బోటు అందుబాటులోకి తెస్తామని అన్నారు.ఈ లక్నవరంలో 9 దీవులు ఉన్నాయని.వీటిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఈ ప్రాకృతిక పర్యాటక క్షేత్రాన్ని బాగా ప్రచారంలోకి తీసుకు రావడానికి మీడియా సహకరిం చాలని అన్నారు.సమ్మక్క-

సారలమ్మ జాతర వలె ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద జాతర ఎక్కడా లేదని,ఉమ్మడి వరంగల్ జిల్లాలో భద్రకాళి ఆలయం,రామప్ప ఆలయాలు గొప్పగా అభివృద్ధి అయ్యా యని,కొత్త రాష్ట్రం కాబట్టి సీఎం కేసిఆర్ మొదట కరెంట్, వ్యవసాయం,ఇరిగేషన్ ప్రాజెక్టులు,పరిశ్రమలపై దృష్టి పెట్టారు.ఇవి పూర్తి అయ్యాక పర్యాటక అభివృద్ది మీద దృష్టి సారించనున్నారు.దేశం మీద పట్టు ఉన్న నాయకులు సీఎం కేసిఆర్.అందుకే పక్కరాష్ట్రాలు ఇలాంటి నాయకులు మాకు కావాలని,అంటున్నారని,అందుకే దేశం మొత్తం ఇలాంటి నాయకులు రావాలని అంటు న్నారని.తొందరలో బొగత,

మల్లూరు జలపాతాలు మరింత అభివృద్ది చేస్తామని అన్నారు.ప్రపంచ హెరిటేజ్ లో తెలంగాణను గొప్పగా పెట్టు కుంటున్నామని జిల్లా కొక పర్యాటక కేంద్రం అభివృద్ధి చేసే ఆలోచన సీఎం కేసిఆర్ కి ఉంది.ఈ లక్నవరం గురించి మీడియా గొప్పగా పచారం చేయాలని కోరుతు న్నాను.ఇంత ప్రకృతి రమణీ యత ఉన్న పర్యాటక క్షేత్రం దేశంలో మరెక్కడా లేదని అన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడు తూ.లక్నవరంను ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో అభివృద్ధి చేస్తుంది.సీఎం కేసిఆర్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ.సీఎం కేసిఆర్ కృషి వల్ల రామప్పకి యునెస్కో గుర్తింపు వచ్చిందని.టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత కాకతీయుల వారసత్వాన్ని కాపాడడంతో పాటు పునః వైభవం తెచ్చా రు.ఇప్పుడు చూస్తుంటే ఇదిమన ప్రాంతమేనా అన్న ఆశ్చర్యం కలుగుతోందని అంతగా అభివృద్ధి చెందిందని,

తెలంగాణ పర్యాటక క్షేత్రాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని అన్నారు.గోవాను మించిన పర్యాటక క్షేత్రాలు తెలంగాణ సొంతం.అని

ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన నేను,మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసిఆర్ కి చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు.అనంతరం టి.జీ.ఓ డైరీ ఆవిష్కరణ చేశారు.

ఈ సమావేశంలో ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్,స్థానిక ప్రజా ప్రతి నిధులు,టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: