గుండాల జనవరి 22 ( మన్యం మనుగడ) ములకలపల్లి మండలం లోని సాక్షి వాగు గ్రామ గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఖండిస్తున్నా మని డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాను రాను ఫారెస్ట్ అధికారుల దాడులు గిరిజనులపై పెరుగుతున్నాయని మహిళలని కూడా చూడకుండా దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు దిగుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఈ సం శ్రీను, సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ అన్న, మండల నాయకులు కొమరం శాంతయ్య , కోడూరి జగన్, ఈసం కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: