మణుగూరు, మన్యం మనుగడ:
తెలంగాణ ఉద్యమ కారుడు-కేసీఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్ ఖాన్ గారి పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండలం-జగ్గారంలో గల ఆరీఫా-రోష్ని వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.. ముందుగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి-వృద్ధులకు బ్రెడ్-పండ్లు పంచిపెట్టారు..అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి.ఉద్యమ ద్రోహుల ఆగడాలు ఎండగట్టారని...అలాగే రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి పార్టీకి విధేయుడిగా-క్రమశిక్షణతో పార్టీ ఎటువంటి పిలునిచ్చినా విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తారని కొనియాడారు.. రానున్న కాలంలో కేసీఆర్ గారు గుర్తించి సముచిత స్థానం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు-కేసీఆర్ సేవాదల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్-మైనారిటీ నాయుకులు నజీర్ షోను-మాల మహానాడు నాయుకులు మేకల భాస్కర్-వెంకట్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: