- క్రీడాకారులను ప్రోత్సహించడం విధంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోటీలు అభినందనీయం
- సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
కొత్తగూడెం:ప్రజానాట్యమండలి
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జిల్లా అధ్యక్షులు
ప్రజా కళాకారుడు మజ్జిగ కొమురయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం వి ఎం ఏ
ప్రాంగణములో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు *అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్* ఏర్పాటు చేయడమైనది
ఈ పోటీల ప్రారంభోత్సవాన్ని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ప్రారంభించి నారు. ఈ సందర్బంగా అమరజీవి కామ్రేడ్ మజ్జిగ కొమురయ్య లేని లోటు తీర్చలేనిదని, ఆయన స్మారకార్థం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తి దాయకం అని అన్నారు పోటీల్లో పాల్గొనడం వలన విద్యార్థులు యువకులు మానసిక ధైర్యాన్ని పొందుతారని క్రీడాకారులలో ఉన్న నైపుణ్యతను బయటికి తెచ్చే విధంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు
ఈ పోటీలలో పాల్గొనడానికి వివిధ మండలాల నుండి 36 టీములు పాల్గొన్నాయి
రెండు రోజులు పాటు జరిగే ఈ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎస్.కె ఫహీమ్ దాదా పారుపల్లి వెంకటేశ్వర్లు, ఎస్ కె ఖయ్యుం
పర్యవేక్షణలలో జరుగుతాయని ఆయన అన్నారు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేయ్యాల రంగారావు, మునిగడప వెంకటేశ్వర్లు బరిగల భూపేష్ మండల రాజు, గురుమూర్తి షమీఉద్దీన్,
మహమ్మద్ అంకుష్
గుగులోతు నగేష్,సురేష్ జలీల్, అబ్బాస్, ఆల్లగొండ గోపి ,శ్యామ్
, రణధీర్ ,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: