మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు ప్రజల యొక్క సమస్యల పైన గ్రామ అభివృద్ధి పనుల పైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సంఘం ఆధ్వర్యంలో మంగపేట ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ములుగు జిల్లా నాయకులు మడే రవి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు పంచాయతీ కార్యాలయానికి ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన అటువంటి కార్యదర్శులు అడిగే వారు లేకపోవడంతో వాళ్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు విధులకు రాకపోవడం వచ్చిన రోజు కూడా ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే పంచాయతీ కార్యాలయంలో ఉండటం జరుగుతుంది. విధులకు రానటువంటి రోజులలో కూడా హాజరు నమోదు పట్టికలో రోజు విధులకు వస్తున్నటుగా సంతకాలు నమోదు చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ప్రజలు ఏదైనా సమస్య చెప్పాలనుకున్నా అక్కడ కార్యదర్శి ఉండడు . ఇలా అయితే ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది. గ్రామం అభివృద్ధి ఎలా చెందుతుంది విధులకు రానటువంటి కార్యదర్శులకు మా గోడు ఎలా చెప్పుకోవాలి నా సమస్య ఎలా పరిష్కారం జరుగుతుంది అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించిన ప్రజా సంఘాల నాయకులు సి ఐ టి యు జిల్లా నాయకులు మడే రవి మండిపడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విధులకు సరిగా రానటువంటి కార్యదర్శులను ఎంక్వయిరీ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం లేనియెడల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు ఎస్ ఎఫ్ ఐ టి .రవి ,పవన్, వంశీ ,సందీప్, సతీష్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: