మన్యం టీవి:
ఖమ్మం:సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను ఖమ్మంలో తన నివాసంలో హోమ్ క్యారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. ‘అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలుండటంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకొస్తా’ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
Post A Comment: