CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బ్యాటరీ దొంగలను పట్టుకున్న కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఏడుళ్ళ బయ్యారం ఎస్ ఐ .టి వి ఆర్ సూరి..

Share it:

 


  • జల్సాలకు అలవాటుపడి చెడు మార్గం ఎంచుకున్న యువత
  • పొలాల వద్ద నిలిపిన ట్రాక్టర్లే వారి లక్ష్యం

 మన్యం టీవీ కరకగూడెం: మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నందు కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, ఏడుళ్ళ బయ్యారం ఎస్ఐ, టి వి ఆర్ సూరి . విలెకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం కరకగూడెం హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా వాహనాల తనిఖీ తమ సిబ్బందితో నిర్వహిస్తుండగా ఏడుళ్ల బయ్యారం నుండి వరంగల్ కు వెళుతున్న ఆటోలో బ్యాటరీలను గమనించి వారిని అడగగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆటోలో ఉన్న ఇద్దరిని విచారించగా గతంలో దొంగతనం చేసిన బ్యాటరీలను అమ్మడం కోసం వరంగల్ వెళ్తున్నామని అని వారు నేరం అంగీకరించడంతో ఆ ఇద్దరినీ అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. పట్టుబడిన నిందితులు వివరాలు 1. తెల్లం నాగరాజు(25) సంవత్సరాలు తండ్రి కోటేశ్వరరావు. రావి చెట్టు గూడెం పినపాక.2. బుట్టరి ప్రశాంత్ తండ్రి మురళి , ఉప్పాక గ్రామం, పినపాక 3.గడ్డం వీరప్రసాద్(31) తండ్రి వెంకన్న శ్రీ విజయలక్ష్మి బ్యాటరీ షాప్ ఎక్స్ రోడ్ ఏడుళ్ల బయ్యారం. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారీ వద్ద ఉన్న 21 బ్యాటరీలను స్వాధీనపరుచుకున్న మని వాటి విలువ సుమారు ఒక లక్షా అరవై ఎనిమిది వేల 

రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.ఏడుళ్ల బయ్యారం సర్కిల్ లో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లు లో 15 కేసులు నమోదయ్యాయని ఏడుళ్ల బయ్యారం తొమ్మిది కేసులు నమోదు కాగా కరకగూడెం లో ఆరు కేసులు నమోదయ్యాయని అవి జులై 7 తేదీ నుండి కేసులు నమోదయ్యాయని, ఏ ఎస్ పి డాక్టర్ శబరీష్, ఏడుళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో వారి సూచనలకు అనుగుణంగా ఈరోజు పట్టుకున్నామని వారు తెలిపారు. యువకులు ఇద్దరు కూడా ఈజీ మనీ అలవాటై వారి వృత్తి డ్రైవర్ కావడంతో రైతుల పొలాల్లో ఎక్కడ ట్రాక్టర్ ఉన్నాయి అని గమనించి బ్యాటరీలను దొంగతనం చేసి ఎక్స్ రోడ్ లో ఉన్న శ్రీ విజయలక్ష్మి బ్యాటరీ షాప్ లో అమ్ముకొని వచ్చిన సొమ్ముతో జల్సాలు అలవాటు చేసుకున్నారని వారు తెలిపారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ , ఏడుళ్ల బయ్యారం ఎస్ ఐ టివిఆర్ సూరి. ఏ ఎస్ ఐ పాపయ్య. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్. సిబ్బంది దాసు, వంశీ ,అజిత్, రాము, సుబ్బారావు, లక్ష్మణ్,పాల్గొన్నారు. వీరిని ఏడుళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు.

Share it:

TS

Post A Comment: