- అతివేగంతో నడుస్తున్న ఇసుక లారీలను నియంత్రించాలి.
- సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ప్రధాన రహదారిలో విచ్చల విడిగా అతివేగంతో నడుస్తున్న ఇసుక లారీలను నియంత్రిం చాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ సోమవారం ఓ ప్రకటనలో పేరొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.కేవలం లారీ డ్రైవర్ అతివేగంగా రావడంతో నిన్న సాయంత్రం ఏటూరు నాగారం లో ప్రమాదం జరిగి గజ్జెల రమేష్ (45) మృత్యువాత పడ్డాడని,మృతుడుని భార్య పిల్లలు ఉన్నారని,ప్రమాదానికి కారకులైన లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మృతుని కుటుం బానికి 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ల నిర్లక్ష్యం మద్యం మత్తు లో వాహనాలు నడపడం వల్ల నే ప్రమాదాలు జరిగి ప్రజలు దారుణంగా చనిపోతున్నారని ఆవేదన చెందారు నేడు వెంక టాపురంలో కూడా ఇసుక లారీలు ఎదురుగా వచ్చి ఢీకొని ఈ ప్రమాదం సంభవించిందని, దాంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే జంకు తున్నారని తెలిపారు.గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగి ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారని,ఇకనైనా సంబంధిత అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని లారీ డ్రైవర్లకు మార్గమధ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం తో పాటు ప్రమాదాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు.లేదంటే సమతా సైనిక్ దళ్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడ తామని హెచ్చరించారు.
Post A Comment: