*
మన్యం టీవి వెబ్ డెస్క్ :
మేడారం గ్రామంలో తుడుం దెబ్బ సమావేశం ఆదివాసీ విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు యాప భాస్కర్ అధ్యక్షత న నిర్వహించడం జరిగింది.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ట్రస్ట్ బోర్డ్ నియామకం లో నిబంధనలు ఉల్లంఘించి, కోర్ట్ ఆదేశాలను భేఖాతారు చేస్తూ ఆదివాసేతరుల తో పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ తెలిపారు.
బహిరంగ ప్రకటన లేకుండా, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కేసు నడుస్తున్నపటికి వాటిని ధిక్కరించి,ఈరోజు తెరాస ప్రభుత్వం పునరుద్ధరణ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘన అని,కోర్ట్ ఆదేశాలను పట్టించుకోకుండా. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఈ ఓ పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
శాశ్వత కమిటీ లేకపోవడంతో ఆలయ అభివృద్ధి కుంటు పడిపోయిందని,
ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి పునరుద్ధరణ కమిటీ ని రద్దు చేసి శాశ్వత కమిటీ ని 100% ఆదివాసీల తో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
*రేపు జరిగే ఆదివాసీ తెగల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి.*
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం రేపు మేడారం గ్రామంలో ని ఆదివాసీ భవన్ లో *ఆదివాసీ తెగల సమ్మేళనం* నిర్వహించడం జరుగుతుంది అని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఛత్తీస్ గఢ్ జడ్జి శైలేష్ కుమార్ గారు వస్తున్నారని, ఈ సమావేశానికి ఆదివాసీ మేధావులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగాట్ల సుమన్,రాష్ట్ర అధికార ప్రతినిధి చందా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: