మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, జనవరి 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జనవరి 26 సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోయిన విజయ్, షేక్ నాగుల్ మీరా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీలకు వైరా నియోజకవర్గ క్రీడాకారులను ప్రత్యేకంగా ఆహ్వానించామని, అదే విధంగా ఈ పోటీలు యువతను ప్రోత్సహించే విధంగా ఉండాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ప్రధాన రహదారికి పక్కన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామని, ఈ క్రీడల్లో గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచే విధంగా ఉండడానికి మొదటి, ద్వితీయ, తృతీయ, నాలుగవ బహుమతులతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్ని బహుమతులు సౌకర్యాలు కల్పించామని, వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి వీసం శెట్టి వికాస్, జిల్లా సహాయ కార్యదర్శులు అనుమల సాయి కుమార్, షేక్ అజీజ్, నాయకులు రూపేష్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: