మన్యం టీవి న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిడీఎస్ యూ అధ్యక్షులు కాంపాటి పృధ్వీ
మన్యం టీవి వెబ్ న్యూస్:
ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి కొఠారి కమిషన్ సూచించిన విధంగా కేంద్ర బడ్జెట్ లో 10 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వీ అన్నారు. ఈరోజు స్థానిక ఇల్లెందు పట్టణంలో PDSU ఇల్లందు పట్టణ కమిటీ సమావేశం బి.సాయి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి కేవలం ప్రణాళిక వ్యయం మాత్రమే కేటాయిస్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి పూర్తిస్థాయిలో బడ్జెట్ కేటాయించడం లేదని దీని మూలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వారు అన్నారు.మోడీ ప్రభుత్వానికి విద్యా రంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో కనీసం ఆరు శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.జరగబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాలలో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు,ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాలలో విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి దృష్టి సారించాలని వారు అన్నారు.మోడీ అనాలోచిత కారణంగా నిరుద్యోగ సమస్య మరింత తాండవిస్తుంది అని ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 8% శాతం నిరుద్యోగ సమస్య ఉందని మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ మర్చిపోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రచారం మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థ మీద లేదని వారు అన్నారు. ఆత్మ నిర్భయ భారత్ పేరుతోని స్వలాభం కోసం పనిచేస్తున్నారు తప్ప నిరుద్యోగులు,పేదల పట్ల సంక్షేమం కోసం ఆలోచించడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకంలో ని కేంద్రం వాటా నిధులను ఇతర కేంద్రీయ విద్యాలయాల నిర్వహణకు అవసరమైన కేంద్రం వాటా నిధులను సకాలంలో విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా జరగబోయే బడ్జెట్ సమావేశాలలో తమ సొంత, కార్పొరేట్ ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, నిరుద్యోగులకు,నిరుపేదల సంక్షేమం కోసం అభివృద్ధి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో PDSU భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ అధ్యక్షుడు యనగంటి వంశీవర్థన్ PDSUఇల్లందు పట్టణ కార్యదర్శి పార్థసారథి,PDSUఇల్లందు పట్టణ సహాయ కార్యదర్శి తరుణ్,ఉపాధ్యక్షులు గంగాధర గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: