CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన ఫారెస్ట్ గార్డ్ మహేష్ నేరాన్ని కప్పిపెట్టెందుకే రేంజర్ తప్పుడు ప్రకటనలు.సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ఖండన..

Share it:


 ములకలపల్లి:జనవరి26:

మన్యం మనుగడ(న్యూస్):

మండలం లోని సాకివాగు ఆదివాసీ మహిళలు నలుగురు కట్టెల కోసం సమీప అడవిలోకి పోయిన వారిపై స్థానిక ఫారెస్ట్ గార్డ్ మహేష్ దాడి చేసి కొట్టడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడాన్ని,తమ గార్డ్ పైనే మహిళలే దాడికి పాల్పఢ్డారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కావాలనే కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేంజర్ రవికుమార్ ఆరోపణలను సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ములకలపల్లి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్ తీవ్రంగా ఖండించారు.ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేసారు.వాస్తవానికి గార్డ్ మహేష్ ఆదివాసీ మహిళల పై దాడి చేసిన విషయం వీడియో లో స్పష్టంగా కనిపిస్తుందని,రేంజర్ కు నేరం అగుపించక పోవటం దుర్మార్గం ఈ నెల రోజులలో ఆపరిసరాలలో కొత్తగా చెట్లు నరికిన జాడ లేదు. మహిళలు సేకరించిన ఎండి పుల్లల జాడ మాత్రమే కనిపిస్తుంది. పరిశీలకులకు వాస్తవం కనబడింది,కాని రేంజర్ కు కనబడకపోవడం ఆశ్చర్య కరమైన విషయమని,గార్డ్ చేసిన నేరాన్ని కావాలని కప్పిపుచ్చేందుకు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని,

అడవుల్లో నివసించే ఆదివాసీ లకు అడవులే జీవనాధారం వారు అన్నం వండుకోవడానికి అడవులలోని ఎండిన కట్టెలను వాడుకుంటారు. ఇదివారికి సాంప్రదాయ హక్కు , ఆదివాసీ చట్టం కూడా వారికి మైనర్ ఉత్పత్తుల సేకరణ హక్కులు కల్పించాయి,వాస్తవానికి ఆదివాసీ లే కట్టె పుల్లలు,బడితెలు ,నులక మంచాల వల్ల అడవులు ధ్వంసం కావడం లేదు పాలకుల వ్యాపారీకరణ ప్రయివేటీకరణ,పోలవరం ప్రాజెక్టు లు,సింగరేణి గనుల వల్ల ఫారెస్ట్ అధికారుల లోని కొంతమంది అవినీతి అధికారుల వల్ల అడవులు ధ్వంసం అవుతున్నాయని,కనుక ఆదివాసీ హక్కుల ను గౌరవించి ,అనవసరంగా మహిళల పై దాడి చేసి ,అసభ్యంగా ప్రవర్తించిన గార్డ్ మహేష్ ను విధుల నుండి తొలగించాలని బాదిత మహిళలపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తి వేయాలని సంఘటన పై విచారణ జరిపి మహిళలకు న్యాయం చేయాలని గాయపడిన మహిళల కు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ములకలపల్లి మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని,లేని యెడల ఆందోళన లను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో పాతగంగారంఎంపిటిసి మడకం.విజయ,పార్టీ జిల్లా నాయకులు నూపా భాస్కర్, పోతుగంటి లక్ష్మణ్,డివిజన్ నాయకుడు కుంజాకృష్ణ , కల్లూరి పద్మ,ఈసం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: