మన్యం టీవీ కరకగూడెం: మండలంలోని చొప్పాల గ్రామ పరిధిలో చిన్నగుంట మీద ప్రసిద్ధ పొందిన సారలమ్మ తల్లి గురువారం నిండు జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై సారలమ్మ తల్లి ని దర్శించుకుని,ప్రత్యేక పూజలు చేశారు.
జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలను జాతర నిర్వాహకులు నిర్వహించడం జరిగింది.
కొనసాగుతున్న క్రీడలను స్వయంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వీక్షించి,అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవరాబాల ఢిల్లీ సరోజిని,స్థానిక సర్పంచ్ జవ్వాజి రాధ-సమ్మయ్య,ఎంపీటీసీ కొమరం మునేంద్ర-సురేష్,టీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,ఉప అధ్యక్షులు గాందర్ల సతీష్ కుమార్,చొప్పాల ఉప సర్పంచు బోడ ప్రశాంత్,క్రీడల నిర్వాహకులు జిగట రామ్,అయ్యెరు శ్రీను,తోలెం వెంకట్,కల్తి నరేష్,సర్వేష్,సాగర్,రవి,నీరజ్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: