CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన గ్రామాన్ని సందర్శించిన ఐరాస పర్యావరణ ఆడిటింగ్ బృందం.

Share it:

 


 ములకలపల్లి:జనవరి28:

(మన్యం మనుగడ)న్యూస్: 

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రైతులకు అదనపుఆదాయం గా కార్బన్ ప్రోత్సాహకాలను అందించే ప్రధాన ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాలలో "కార్బన్ క్రెడిట్" మీద పనిచేస్తున్న పయనీర్ అసోసియేషన్ వారి నేతృత్వంలోని జీ.కే.ఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ సంస్థ,ప్రాజెక్ట్ లో భాగంగా పర్యావరణ ఆడిటింగ్ మరియు జీ.కే.ఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ బృందం సంయుక్తంగా శుక్రవారం ములకలపల్లి మండలం గండి ప్రోలు గ్రామ పంచాయతీ ప్రజలతో మమేకమై కార్బన్ క్రెడిట్స్ యొక్క ఉపయోగాలను గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. మరియు వారి యొక్క పొలాలను కూడా సందర్శించడం జరిగింది. ఈ బృందం రైతులకు వాతావరణంలో ఉన్న కర్బన శాతాన్ని తగ్గించడానికి, మహిళలు స్వయం సమృద్ధి ,ఆర్థిక పరిపుష్టి సాధించడానికి అటవీ ఉత్పత్తులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో, విలువైన సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సీతాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ సుధీర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ద్వారా పేదలకు అందించే కార్బన్ ప్రోత్సాహకాలను,ఇతర మంచి కార్యక్రమాలను తమ ఊరు గ్రామపంచాయతీ ప్రజలకు అందించి భాగస్వాములను చేసినందుకు జీకే ఫారెస్ట్రీ వారి కి అభినందనలు తెలియజేస్తూ,భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా ఎటువంటి కార్యక్రమమైనా తమ ఊరి ద్వారా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఆడిటింగ్ బృందం తరపున అక్షయ,అమృత, జి కె ఎఫ్ సంస్థ తరఫున టెక్నికల్ విభాగాధిపతి వంశీకృష్ణ ,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ సమన్వయకర్త లైన లక్ష్మీనారాయణ, కృష్ణ, మరియు సంస్థ సభ్యులు రజియా బేగం , లలిత, దుర్గాప్రసాద్, రవితేజ గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: