- 7వ విడత 50 మందికి కంటి ఆపరేషన్లు విజయవంతం: ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
*పినపాక నియోజకవర్గ లో ఒక మహా యజ్ఞం లా పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లో కంటి చూపు సరిగా లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాదు లో ఉన్న పుష్పగిరి కంటి ఆసుపత్రి కి 7వ విడత పంపించిన 50 మంది విజయవంతంగా కంటి ఆపరేషన్లు పూర్తి చేసుకొని ఆదివారం మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారిని స్వయంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్లు సూచించిన సూచలను ఖచ్చితంగా పాటించాలి అని వారికి ఆయన తెలియజేశారు. ఆపరేషన్ జరిగిన విధానం పై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం డాక్టర్ ఇచ్చిన చుక్కల మందును కళ్ళలో వేశారు.ఈ సందర్భంగా *మీ కొడుకులా, మీ కంటికి వెలుగులా* ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.పేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అందరికీ టిఫిన్ లు ఆయనే స్వయంగా అందించి, బ్రెడ్ ప్యాకెట్ లను కూడా పంపిణీ చేశారు.అనంతరం విప్ రేగా దంపతులు దగ్గరుండి వారి వారి గమ్యస్థానాలకు చేరే విధంగా ఏర్పాటు చేసి వారిని ఇంటికి పంపించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,టిఆరేస్వి,నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: