CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యం పద్మశ్రీ కి సత్కారం.ఘనంగా సన్మానించిన పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక.

Share it:

 


  • ఆధ్వర్యం వహించిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ


మన్యం మనుగడ, పినపాక:


ఆదివాసి ఆణిముత్యాన్ని దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ పలకరించింది. అంతరించిపోతున్న ఆదివాసీ కళల్లో ఒకటైన దేవతామూర్తులను గద్దెలపైకి ఆహ్వానించడానికి "కంచు తాళం- కంచు మేళం" పేరుతో చేసే డోలు వాయిద్యం ఖ్యాతిని దేశాంతరాలకు చాటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన వ్యక్తి సకిన రామచంద్రయ్య. ఆదివాసీ కలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రామచంద్రయ్యను పద్మశ్రీ రూపంలో పలకరించింది. ఒక్కసారిగా ఆదివాసి జాతి మొత్తాన్ని మేల్కొలిపిన గొప్ప ఖ్యాతి గడించిన తెలంగాణ వ్యక్తిగా రామచంద్రయ్య పేరు చిరస్థాయిగా నిలవనుంది.

 శనివారం నాడు పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ సమక్షంలో పినపాక మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఏకమై కూనవరం లోని రామచంద్రయ్య స్వగృహానికి వెళ్లి గజమాలతో సత్కరించి, శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, ఆదివాసి జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన రామచంద్రయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కంచు తాళం కంచు మేళం గురించి భారతదేశానికి తెలియజేసిన ఆదివాసి జాతి ముద్దుబిడ్డ రామచంద్రయ్య అని తెలియజేయడం జరిగింది. ఆదివాసి సాంస్కృతిక డివిజన్ సంఘ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల ఆదివాసీ గ్రామం కళను భారతదేశానికి తెలియజేసి, పద్మశ్రీ పొందిన ఆదివాసి ఆణిముత్యం రామచంద్రయ్య అని తెలియజేశారు. ఆదివాసి తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షులు కొమరం వెంకటేష్ మాట్లాడుతూ, పట్టు తప్పుతున్న ఆదివాసీ ఖ్యాతిని గట్టుకు చేర్చిన దిక్సూచి రామచంద్రయ్య అని తెలియజేశారు. ప్రముఖ కళాకారుడు, గాయకుడు సిద్దెల హుస్సేన్ రామచంద్రయ్య గొప్పతనాన్ని వివరిస్తూ తన గానామృతాన్ని పంచడం జరిగింది. ఆదివాసీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు రామచంద్రయ్యకు మిఠాయిలు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.


ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం ఎంపీపీ కారం విజయ కుమారి, పినపాక మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసి ఐక్య వేదిక సభ్యులు, తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

TS

Post A Comment: