CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంటింటికీ ఆరోగ్య సర్వేలో పాల్గొన్న మండల అధికారులు .కరోనా గురించి పలు సూచనలు.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామ పంచాయతీలో పినపాక మండల అధికారులు తాహసిల్దార్ విక్రమ్ కుమార్, వైద్యాధికారి శివకుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఆరోగ్య సర్వే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాహసిల్దార్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని, వైద్యులు చెప్పిన సలహాలను తప్పకుండా పాటించాలని తెలియజేశారు. వైద్యాధికారి శివ కుమార్ మాట్లాడుతూ, గతంలో కంటే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని, జ్వరం కు సంబంధించిన ఎటువంటి అనుమానం వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, భయపడాల్సిన అవసరం లేదని, తగిన మందులు ఇచ్చి పంపుతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: