మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ( 21 ) శుక్రవారం ;-
ఈరోజు కొత్తగూడెం శేషగిరి భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి గార్లపాటి రామనాదం అద్యక్షత వహించగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు రేసు ఎల్లయ్య ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యార్లగడ్డ భాస్కర్ రావు ,మాజీ జిల్లా అద్యక్షులు శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘంను బలోపేతం చేయాలని ఈనెల 24వతారీకున రాష్ట్ర సమితి పిలుపు మేరకు వ్యవసాయ కార్మికులను సమీకరించి అన్ని మండల కేంద్రాలలలొ, మరియు RDO కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాలో నిరసన తెలియపరిచి 1)వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని,2)వ్యవసాయ కార్మికులకు 55సంవత్సరాలకు నెలకు 5000/-రూపాయలు ఇవ్వాలని,3)ప్రతి కార్మికుడికి ఉచిత ఆరోగ్య&ప్రమాదభీమా కల్పించాలని,4)ప్రతి ఇంటి స్థలం కలిగిన ప్రతి వ్యవసాయ కార్మికునికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేయాలని తదితర డిమాండ్ లతో మెమోరాండం ఇవ్వాలని మాట్లాడుతూ చెప్పారు.అలాగే సంఘం బలోపేతం కోసం అన్ని మండలాలో కమిటీ నిర్మాణాలు చేయాలని,సభ్యత్వం చేర్పించాలని అనంతరం గ్రామ స్థాయిలో కార్మికులను సమీకరించి పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశం లో బెల్లం కృష్ణవేణి , పూర్ణ,పేరాల శ్రీనివాస్ ,వడ్లమూడి నాగేశ్వరరావు ,బాసుపాక రవి ,దారా శ్రీనివాస రావు ,జలీల్ పాషా,తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
Post A Comment: