CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు.పండుగ సంక్రాంతి.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Share it:


మన్యం మనుగడ మంగపేట.

రైతుల పండుగ సంక్రాంతి అని వ్యవసాయ రంగానికి వన్నె తెచ్చే ఈ సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో కాంతులు నింపాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు శనివారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో కనుమరుగవుతున్న మన పండుగ సాంప్రదాయాలను గుర్తు చేసుకునే విధంగా రంగవల్లులు హరిదాసులు గొబ్బెమ్మలు చిన్నారుల పతంగులు గంగిరెద్దుల ఆటలు పిండివంటలతో వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించడం గత పదేళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగకు వన్నె తెచ్చే విధంగా గ్రామాల్లో సిరిసంపదలు తులతూగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి రైతాంగానికి మేలు చేసే విధంగా పలు పథకాలను రూపొందించి అమలు చేయాలని కోరారు గద్దె పై ఉన్న పాలకులు రైతుల గతి మార్చే విధంగా కృషి చేయాలన్నారు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగంతో సంక్రాంతి పర్వదినం కళ తప్పుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతులకు వ్యవసాయ కార్మికులకు కర్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రంగవల్లికలు వేసిన పలువురు మహిళలకు సాంబశివరెడ్డి బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల గాలిపటాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్లశేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతి రావు అకినేపల్లి మల్లారం టి కొత్తగూడెం గ్రామాలకి చెందిన పలువురు మహిళలు రైతులు యువతి యువకులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: