CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా రేగా కాంతారావు ఎన్నికైన సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి వారి మనోభావాలకు అద్దం పట్టేలా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో దిబ్బగూడెం గ్రామం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రేగా కాంతారావుని కేసీఆర్ నియమించడం పట్ల సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ కి పాలాభిషేకం చెయ్యడం జరిగింది. అనంతరం టపాసులు కాల్చడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల జిల్లాగా మరొకమారు కెసిఆర్, కేటీఆర్ నిరూపించారని కొనియాడారు. జిల్లా యందు గిరిజనులకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం గిరిజనుల మనోభావాలను బలపరచడం అని తెలియజేశారు. రేగాతో మరింత టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కాబోతుందని చెప్పారు. కెసిఆర్ కి, కేటీఆర్ కి ఆశయసాధనకు రేగా పని చేయబోతున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలపడిందని, వారికి అధ్యక్ష పదవి కట్టబెట్టడం మరింత బలోపేతం కాబోతుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి సంక్షేమాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని కొనియాడారు. రానున్న రోజులలో తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ విజయమని అలాంటి పార్టీకి సంక్షేమం అందిస్తున్న కెసిఆర్ కి పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ యువజన విభాగం అధ్యక్షులు జమ్మి జయరాజు, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి నారం నరసింహ రావు, కిషోర్, దుర్గారావు, కణితి రాజు, మంగరాజు, చిన్న, కళ్యాణ్, రామారావు, చల్మారావు నాయకులు,కార్యకర్తలు అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: