మన్యం మనుగడ మంగపేట.
25/01/2022 రోజున ఉదయం 9గంటలకు మణుగూరు నుండి ములుగు వైపు ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన నమ్మదగిన సమాచారం మేరకు మంగపేట ఎస్సై తాహెర్ బాబా వారి సిబ్బంది సిఆర్పిఎఫ్ ఫోర్స్ తో తిమ్మంపేట ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సమయం1:30 గంటలకు మణుగూరు నుండి ఒక టాటా వెంచర్ వాహనం నెంబర్ AP28BQ 2447 నడుపుతున్న వ్యక్తి ని తనిఖీ చేయగా అందులో అనుమానస్పదంగా బ్రౌన్ టేప్ చుట్టిన పాకెట్స్ కలవు. వెంటనే అట్టి వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా అతని పేరు వెంబటి రాజశేఖర్ తండ్రి గంగన్న వయసు 28 సంవత్సరాలు కులం పెఱిక వృత్తి డ్రైవరు నివాసం కల్లెడ గ్రామం కడియం మండలం నిర్మల్ జిల్లా అని తెలిపి అతనితో పాటు మరో నలుగురు కలిసి 24 /01/ 2020 2 రోజున ఉదయం టాటా వెంచర్ వాహనం మరియు మరొక కార్ లో ఉట్నూర్ నుండి బయలుదేరి సాయంత్రం మోతుగూడెం దాటిన తర్వాత అటవీప్రాంతం చేరుకొని అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి అదే రాత్రి అట్టి టాటా వెంచర్ వాహనంలో ఐదుగురు కలిసి లోడ్ చేసి పైకి కనపడకుండా ఉండటానికి పైన బట్టలు బట్టలు డబ్బాలు వేసి ముందు మరొక కారులో నలుగురు వ్యక్తులు వెళ్తుండగా వెనకాల గంజాయి లోడుతో టాటా వెంచర్ వాహనంలో నిందితుడు వెంపటి రాజశేఖర్ తండ్రి గంగన్న వస్తుండగా నిందితుడు మంగపేట మండలంలోని తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే పోలీసు వారు పట్టుకున్నారు పట్టుబడ్డ గంజాయి612 కిలోలు ఉన్నది దాని విలువ సుమారు 90 లక్షలు ఉంటుంది మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
Post A Comment: